విచారణకు అనుమతివ్వండి: శంకరన్నకు గ్రీన్‌ఫీల్డ్ ఉచ్చు

శంకర రావు ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యే కావడం వల్ల ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి అవసరం అవుతుంది. ఆయనను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలంటూ సిఐడి చీఫ్ కృష్ణ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్‌ఫీల్డ్‌కు సంబంధించిన కోట్ల విలువైన 70 ఎకరాల స్థలాన్ని శంకర రావు, ఆయన సోదరుడు చేశారని గ్రీన్‌ఫీల్డ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున చంద్ర శేఖర్ కోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాలతో సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని, రెవిన్యూ అధికారులపై శంకర రావు సోదరులు దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైందని, ఆధారాలు కూడా ఉన్నందున ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని సిఐడి తన లేఖలో కోరారు.
ఇప్పటిదాకా 34 మంది అధికారులు, అనధికారులను ప్రశ్నించి 18 డాక్యుమెంట్లు సేకరించినట్లు సిఐడి అధికారులు తెలిపారు. కాగా, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర రావును మెరుగైన చికిత్స కోసం బంజారాహిల్స్ కేర్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications