జిందాల్ సంస్థ తప్పుడు సమాచారం, దాసరి నోట్: సిబిఐ

ఈ కుంభకోణంపై సిబఐ కోర్టుకు 12వ ఎప్ఐఆర్‌ను సమర్పించింది. గనుల కేటాయింపు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాలపై జిందాల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఆ కంపెనీకి గతంలో కేటాయించిన గనుల పైనా సరైన సమాచారం ఇవ్వలేదని, అలాంటి సంస్థకు ప్రయోజనం చేకూరేలా నాటి మంత్రి దాసరి.. బొగ్గు శాఖ కార్యదర్శికి నోట్ పంపారని అందులో సిబిఐ పేర్కొంది.
బొగ్గు మంత్రిత్వ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చినా.. స్క్రీనింగ్ కమిటీ వాటికే గనులు కేటాయిస్తూ జాబితా రూపొందించిందని తెలిపింది. అమరకొండ గనులను జిందాల్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనను విద్యుత్ మంత్రిత్వ శాఖ వ్యతిరేకించిందని పేర్కొన్నారు. కాగా సిబిఐ తాజా ఎఫ్ఐఆర్‌లో నవీన్ జిందాల్‌కు చెందిన రెండు సంస్థలను నిందితులుగా పేర్కొంది.
జార్ఖండ్ ప్రభుత్వం కూడా జిందాల్‌కు అనుకూలంగా వ్యవహరించిందని తెలిపింది. 2007లో రాష్ట్ర ప్రభుత్వం ఇతర కంపెనీలను కాదని జిందాల్ గ్రూప్ సంస్థలకు అమరకొండ ముంగదంగల్ గనులు అప్పగించాలని సిఫారసు చేసిందని పేర్కొంది.












Click it and Unblock the Notifications