Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: క్యాచ్‌ డ్రాప్‌లపై సురేష్ రైనా, జడేజా ఫైట్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) ఆరో ఎడిషన్‌లో ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ దుర్భాషలాడుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిద్దరు వేర్వేరు జట్లలో ఉన్నారు. అక్కడ సమస్యలు ఉండవచ్చు. కానీ ఒకే జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు ఘర్షణకు దిగితే ఎలా ఉంటుందనే రవీంద్ర జడేజా, సురేష్ రైనాలకు మధ్య జరిగిన ఉదంతాన్ని చూడాల్సిందే.

సెల్‌కాన్ మొబైల్ కప్ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఈ నెల 5వ తేదీన వెస్టిండీస్‌తో జరిగిన భారత్ మ్యాచులో సురేష్ రైనా, రవీంద్ర జడేజా గొడవ పడ్డారు. మైదానంలో జరిగిన ఆ గొడవను టీవీ చానెళ్లలో ఎంతో మంది క్రికెట్ అభిమానులు చూశారు.

Jadeja and Raina

తన బౌలింగులో సురేష్ రైనా రెండు క్యాచ్‌లను వదిలేయడంతో జడేజా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కనిపించాడు. మ్యాచ్ 26, 32 ఓవర్లలో సురేష్ రైనా క్యాచులను జారవిడిచాడు. వెస్టిండీస్ 34వ ఇన్నింగ్సులో రైనా, జడేజా గొడవకు దిగారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జోక్యం చేసుకుని వారిని చల్లబరిచాడు.

సురేష్ రైనా, రవీంద్ర జడేజా ఐపియల్‌లో ఒకే జట్టులో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌కు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

<center><center><center><center><iframe width="640" height="360" src="http://www.youtube.com/embed/xKx0Y6WlXJk?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center>

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+