దొంగలే నేతలు: జగన్ పార్టీపై విహెచ్, షర్మిల యాత్ర పైనా

ఇలాంటి నాయకులు, ఇలాంటి పార్టీలు అవసరమా అని ప్రజలు ఆలోచించాలన్నారు. జగన్ పార్టీని చూసి పిల్లలు కూడా చెడిపోతున్నారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్రకు ఎంత జనం వస్తున్నారో అంటూ ఎద్దేవా చేశారు. ఆమె పాదయాత్రలో గూండాలూ, రౌడీలే ఉన్నారని ఆరోపించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికలలో గెలుస్తుందని, అక్కడే భవిష్యత్తు ఉంటుందని కొందరు నాయకులు కలలు కంటున్నారని, ఆ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని, జైళ్లకు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చునన్నారు. ప్రజలతో ఛీ అనిపించుకోవాలనుకుంటే ఆ పార్టీలో చేరవచ్చునన్నారు.
ఆ పార్టీ గుణగణాలు బాగా లేవన్నారు. తాను గతంలోను జగన్ పార్టీ దొంగల పార్టీ అని చెప్పానన్నారు. ఇప్పుడు నిరూపితమవుతోందన్నారు. తాను ఏదైనా ఉంటే తప్ప అవాస్తవాలు చెప్పనన్నారు. జగన్ పార్టీలో దొంగలే నేతలుగా మారారనివిరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications