కొణతాలకు పుండు మీద కారం: సమన్వయకర్తగా దాడి

Dadi Veerabhadra Rao - Konatala Ramakrishna
హైదరాబాద్: తమ పార్టీలోకి వచ్చిన విశాఖ జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావుకు కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో ఝలక్ ఇచ్చింది. దాడి రాకతో కొణతాల అలక వహించిన విషయం తెలిసిందే. పార్టీలోకి దాడి రాకను ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా అధిష్టానం వెనక్కి తగ్గలేదు.

దాడితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని కొణతాల ఇప్పటికే చెప్పారు. కొణతాల అసంతృప్తిని పక్కన పెట్టి దాడిని పార్టీలోకి చేర్చుకున్న అధిష్టానం ఆయనకు పుండు మీద కారం చల్లినట్లుగా మరో ఝలక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పంచాయతీ ఎన్నికల కోసం సమన్వయకర్తగా నియమించింది. అదే సమయంలో కొణతాల రామకృష్ణకు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని సమాచారం.

దాడి చేరిక తర్వాత అసంతృప్తితో ఉన్న కొణతాల వర్గం పార్టీ తమకు సరైన గుర్తింపునివ్వడం లేదని ఆందోళన చెందుతోందట. తాజాగా దాడిని సమన్వయకర్తగా నియమించడం పట్ల కొణతాలతో పాటు ఆయన వర్గం ఆగ్రహంగా ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+