'కెసిఆర్, నేను రాజకీయావసరాల కోసమే, మాకేం లాభం'

రాష్ట్ర విభజన జరిగితే తమ మెదక్ జిల్లాకు ఎలాంటి లాభం లేదన్నారు. విడిపోతే మెదక్ జిల్లాకు తాగునీరు, సాగునీరు ఇక్కట్లు వస్తాయన్నారు. మెదక్ జిల్లాకు, జంట నగరాలకు సింగూరు నుండి తాగు నీరు వస్తుందని, విభజన జరిగితే తమ జిల్లాకు తాగు, సాగు నీరు ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. విభజనవాదం వినిపిస్తున్న వారు తన సవాల్‌కు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణవాదంతో బతుకుతున్న అన్ని రాజకీయ పార్టీలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మెదక్ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఇప్పటి వరకు ఏమీ చేయలేదన్నారు. తెరాస నేతలు తమ జిల్లాకు తాగు నీరు, సాగు నీరు వచ్చేందుకు ఏం చేశారో చెప్పాలన్నారు.
రెచ్చగొట్టే ప్రకటనలు వద్దు: గండ్ర
సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని, రాష్ట్ర విభజనకు సహకరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగే కోర్ కమిటీ భేటీలో విభజన అంశం పైనే ప్రధాన చర్చ ఉంటుందన్నారు. అధిష్టానం మదిలో రాయల తెలంగాణ ప్రతిపాదన లేదన్నారు. అది కేవలం మజ్లిస్ ప్రతిపాదన మాత్రమే అన్నారు.
కాగా రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంట్లో పలువురు సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications