నాటుబాంబులతో ఉద్యోగి ఇంటిపై దాడి, మావోల దాడులు

 Unknown persons attack with country made bomb
రాజమండ్రి/విశాఖ/విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు పిఏగా పని చేసిన మూర్తి ఇంటి పైన గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. దాడిలో ఇంటి ముందు భాగం ధ్వంసమైంది. పక్కనున్న మరో మూడు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. మూర్తి, కుటుంబ సభ్యులు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. బులెటిన్ స్టిక్స్‌తో ఇంటిని పేల్చేసే ప్రయత్నాలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం దుండగులు మూర్తిపై కాల్పులు జరిపారు.

విశాఖ ఏజెన్సీలో దాడులు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. ఎన్నికల్లో, ప్రచారంలో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారు. జికె వీధి మండలం దేవరల్లి గ్రామంలో బుధవారం రాత్రి మావోయిస్టులు స్థానిక కాంగ్రెసు నేత, మాజీ జడ్పీటిసి మత్స్యరాజుకు దేహశుద్ధి చేశారు. ఇంటిని లూటీ చేశారు. ద్విచక్ర వాహనం ధ్వంసం చేశారు.

మంగళపాలెం పిఏసిఎస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ బాబురావును మావోయిస్టులు అపహరించారు. ఎన్నికలను బరిష్కరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెసు నాయకులు తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తుండటంతో మావోలు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.

సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడి

కరీంనగర్ జిల్లా బోయనపల్లి మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతి సర్పంచ్ అభ్యర్థి నర్సింహా రెడ్డి పైన బుధవారం రాత్రి దాడి జరిగింది. సోదరుడి కుమారుడే దాడి చేసి గాయపర్చాడు. ఆయనను హైదరాబాదు ఆసుపత్రికి తరలించారు.

దుర్గ గుడి వద్ద విరిగిపడ్డ కొండచరియలు

కృష్ణా జిల్లా విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డు వద్ద గురువారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు విరిగి పడటంతో ప్రయివేటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+