అయోధ్య హనుమాన్ గుడిలో కాల్పులు, ఒకరి మృతి

మహంతులకు చెందిన రెండు ముఠాల మధ్య వివాదమే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది. హనుమాన్ గుడి ఆలయానికి చెందిన మహంత్ భవనాథ్ దాస్ ఆధ్వర్యంలో ముఠాకు, మహంత్ హరిశంకర్ దాస్ నేతృత్వంలోని ముఠాకి మధ్య.. భక్తుల నుంచి స్వీకరించిన ఆస్తులు, సంపద పైన ఆధిపత్యం విషయమై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోందని తెలుస్తోంది.
రెండు వైపుల నుంచి కాల్పులకు సంబంధించి లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయని, ప్రస్తుతం ఎప్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు. కాగా కాల్పులు జరిగిన ఇరువర్గాల్లో ఒకరికి రాజకీయ పార్టీతో సన్నిహిత సంబంధాలు ుండగా, మరొకరు హనుమాన్ గడి సన్యాసుల్లో మంచి పేరు ఉంది.












Click it and Unblock the Notifications