ఫ్లడ్స్: బైక్‌తో కసరత్తు, అరటి తెప్పపై చిన్నారి(పిక్చర్స్)

శ్రీనగర్/హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జమ్ము కాశ్మీర్‌లో వర్షాల కారణంగా రెండు రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర భారతంలోని ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోను విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

గంగా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. వరదలతో పలు రాష్ట్రాల్లో జన జీవనం స్తంభించింది. రాజస్థాన్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో వరదలు పొంగుతున్నాయి. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల్లోకి రాకపోకలు స్తంభించిపోయాయి.

మన రాష్ట్రం విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలో పలు లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి తగ్గుతోంది. ఈ ఉదయం ఎనిమిది గంటలకు 48.1 అడుగులకు తగ్గింది. మరికొంత తగ్గితే రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తారు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.

గంగానది

గంగానది

ఉత్తర భారత దేశంలో జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలహాబాదులోని ఓ ప్రాంతంలో ఇళ్ల దరికి చేరిన వరద. నీట మునిగిన చెట్లు.

ద్విచక్ర వాహనం

ద్విచక్ర వాహనం

ఉత్తర భారత దేశంలో జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాదులో ఓ ప్రాంతం నీట మునిగింది. భారీ వరదలో మునిగిపోయిన తన ద్విచక్ర వాహనాన్ని తీసుకు వెళ్తున్న ఓ వ్యక్తి.

ఉత్తర ప్రదేశ్‌లో నీట మునిగిన దేవాలయం

ఉత్తర ప్రదేశ్‌లో నీట మునిగిన దేవాలయం

ఉత్తరాదిన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలహాబాదులోని ఓ ప్రాంతంలో పైకప్పు వరకు నీట మునిగిన ఓ హనుమాన్ దేవాలయం.

యుపిలో

యుపిలో

భారీ వర్షాల కారణంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలహాబాదులోని ఓ ప్రాంతంలో నీట మునిగిన ఇళ్లు. నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలకు గ్రామాలే ఇళ్లు నీటిలో మునిగిపోయాయి.

నితీష్ కుమార్

నితీష్ కుమార్

భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి, జనతా దళ్(యు) ముఖ్యనేత నితీశ్ కుమార్. ఆయన పాట్నాలో ఏరియల్ సర్వే చేశారు.

పడవలపై ప్రయాణం

పడవలపై ప్రయాణం

వర్షాలతో పశ్చిమ బెంగాల్‌లో ఊళ్లకు ఊళ్లే నీట మునిగాయి. దీంతో ప్రజలు పడవల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో గ్రామస్తులు పడవల ద్వారా ప్రయాణిస్తున్న దృశ్యం

నీట మునిగిన ఇళ్లు

నీట మునిగిన ఇళ్లు

భారీ వర్షాలతో పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర మిడ్నాపూర్‌లో నీట మునిగిన ఓ ఇల్లు దృశ్యం. వరదల కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పడవలో షికారు!

పడవలో షికారు!

వర్షాలతో పశ్చిమ బెంగాల్‌లో ఊళ్లకు ఊళ్లే నీట మునిగాయి. దీంతో ప్రజలు పడవల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో గ్రామస్తులు పడవల ద్వారా ప్రయాణిస్తున్న దృశ్యం

సీన్ రివర్స్!

సీన్ రివర్స్!

వర్షాల కారణంగా ఉత్తర భారతదేశంలో భారీ వరదలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో నడుం లోతు, మెడలోతుకు నీరు వచ్చింది. భువనేశ్వర్‌లో నీటిలో సైకిల్‌ను మోసుకుపోతున్న వారి దృశ్యం.

నీటిలోనే...

నీటిలోనే...

బీహార్ రాష్ట్రం మనేరులోని హల్దీచప్రలో ఊళ్లలోకి నీరు చేరుకుంది. ఓ గ్రామంలో అవసరార్థం నీటిలోనే ఈదుకుంటూ వెళ్తున్న జనాలు. పురుషులే కాకుండా మహిళలు, చిన్నారులు అందరూ నీటిలో ఈదుకుంటూ లేదా నడం లోతు నీటిలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్తున్నారు.

భుజంపై సైకిల్

భుజంపై సైకిల్

బీహార్ రాష్ట్రం మనేరులోని హల్దీచప్రలో ఊళ్లలోకి నీరు చేరుకుంది. మెడ లోతు వరకు నీరు పలు ప్రాంతాల్లో చేరుకుంది. ఓ పాల వ్యాపారి మెడ లోతు నీటిలో తన సైకిల్‌ను తీసుకు వెళ్తున్న దృశ్యం

నీటిలో...

నీటిలో...

బీహార్ రాష్ట్రం మనేరులోని హల్దీచప్రలో ఊళ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ గ్రామంలో మరో ప్రాంతానికి వెళ్లే దారిలో మోకాలి పైవరకు నిలిచింది.

నీట మునిగిన దేవాలయం

నీట మునిగిన దేవాలయం

ఉత్తరాదిన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలహాబాదులోని ఓ ప్రాంతంలో పైకప్పు వరకు నీట మునిగిన ఓ దేవాలయం.

భద్రతా చర్యలు

భద్రతా చర్యలు

జమ్మూ కాశ్మీర్‌లో వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని, అతని కొడుకును కాపాడిన భద్రతా దళాలు. తావి నదిలో వారు చిక్కుకుపోయారు. విషయం తెలియడంతో స్పందించిన భద్రతా సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చింది.

అరకు తెప్పపై చిన్నారి

అరకు తెప్పపై చిన్నారి

అస్సాంను కూడా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఓ గ్రామంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు అరకు తెప్పను వినియోగించుతున్న వ్యక్తి. చిన్నారిని తెప్పపై కూర్చుండబెట్టిన దృశ్యం

అహ్మదాబాదులో...

అహ్మదాబాదులో...

ఉత్తరాదిన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాదులోని ఓ ప్రాంతంలో నీరు నిలిచిపోయిన దృశ్యం.

ఏరియల్ వ్యూ

ఏరియల్ వ్యూ

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర మిడ్నాపూర్ జిల్లాలో ఓ గ్రామంలో నీట మునిగిన గ్రామం విహంగ వీక్షణం. గ్రామస్తులు అవసరార్థం మరో ప్రాంతానికి వెళ్లేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు.

వారణాశి

వారణాశి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ వారణాశిలోని ఓ ప్రాంతంలో నీట మునిగిన ఓ దేవాలయం. గంగానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ వరదలో గుడి మునిగింది.

దక్షిణ భారతం

దక్షిణ భారతం

దక్షిణ భారత దేశంలోని కోజికోడ్ జిల్లా ముక్కంలో నీట మునిగిన దృశ్యం. ముక్కంలోని ఓ ప్రాంతంలో పడవ ద్వారా మరో ప్రాంతానికి వెళ్తున్న ఓ వ్యక్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+