పార్టీలు మద్దతిచ్చినా..: అవనిగడ్డ ఉప ఎన్నిక ఖాయం

బుధవారం సాయంత్రంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేసింది. కానీ ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉపసంహరణకు అంగీకరించలేదు. ఈ నెల 21వ తేదిన ఎన్నిక జరుగుతుంది. 24న కౌంటింగ్ ఉంటుంది.
టిడిపి విజ్ఞప్తి మేరకు అవనిగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం టిడిపి అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థులు రావు సుబ్రహ్మణ్యం, పైకం రాజశేఖర్‌లు బరిలో నిలిచారు. దీంతో ముక్కోణపు పోటీ కానుంది.
అవనిగడ్డకు ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి బ్రాహ్మణయ్య ఏప్రిల్ 21వ తేదిన కన్నుమూశారు. ఈసి గత నెల 27వ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీలోగా నామినేషన్లు దాఖలు, 5లోగా ఉపసంహరణ, 7లోగా ఉపసంహణ గడువు ఇచ్చింది.












Click it and Unblock the Notifications