4నెలల పదవి వదలండి: వీరశివా, చిరు బాటలో నిరసన

విభజనపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. కాంగ్రెసు పార్టీ విధిలేని పరిస్థితుల్లోనే విభజన పైన నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు పలికాయన్నారు. ఇప్పుడు ఆ పార్టీలు మనసు మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును చంపాల్సిన అవసరం సీమాంధ్రులకు లేదన్నారు.
ఆస్తులు, రాజకీయ వారసత్వం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా సుపారీ ఇచ్చారేమో అన్నారు. వార్తల్లో ఉండేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారన్నారు. కొందరు రాయల తెలంగాణ అంటున్నారని, అది సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కోసం నేతలు, పార్టీలు ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా బయటకు వస్తారని, ఆయన గురించి అందరికీ తెలుసునన్నారు.
చిరుకు నిరసన
సీమాంధ్రలో ఉద్యమం రోజురోజుకు వేడెక్కుతోంది. సమైక్యాంధ్ర జెఏసి నేత రామారావు చిరంజీవి రాజీనామా చేయాలంటూ వినూత్న నిరసన తెలిపారు. మగమహారాజులో చిరంజీవి అకుంఠిత దీక్షతో సైకిల్ తొక్కి గెలుస్తారని, తాను ఆయన బాటలోనే నిరసన తెలుపుతున్నానని అన్నారు. మంత్రి విశ్వరూప్ ఆందోళనలో పాల్గొన్నారు. నేతలు అందరూ రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు.












Click it and Unblock the Notifications