పార్లమెంటు: కొనసాగుతున్న వాయిదాల పర్వం

కాంగ్రెసు ఎంపీలు ప్లకార్డు పట్టుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసనలు తెలిపారు. రాజ్యసభలో టిడిపి సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు వెల్‌లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.
విభజన సెగ నేపథ్యంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మొదట పదిహేను నిమిషాలు వాయిదా పడింది. ఆ తర్వాత ప్రారంభమైనా సభ్యుల నినాదాలు చేశారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు జమ్ముకాశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టారు.
ఇటు విభజన, అటు అల్లర్ల కోసం చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో చైర్మన్ రాజ్యసభను రెండోసారి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. లోకసభలో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి, ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడంతో స్పీకర్ పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications