తెలంగాణపై హరికృష్ణ మాటలు వ్యక్తిగతం: ఎర్రబెల్లి

ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో సీమాంధ్రులు తమ ఉద్యోగాలు చేసుకోవచ్చునని, ఇక్కడే ఉండవచ్చునని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనవసర విమర్శలు చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఎర్రబెల్లి విమర్శించారు.
సీమాంధ్రలో ప్రజలు ఆందోళనలో ఉన్నారని, వాళ్లకు ధైర్యం కల్పించేందుకే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేయనున్నారని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ ఎంపీ హరికృష్ణ రాజీనామా విషయమై మీడియా ప్రశ్నించగా అది ఆయన వ్యక్తిగత విషయమని, సమస్యలు వచ్చినప్పుడు అధినేత మాట్లాడతారని ఆయన సమాధానమిచ్చారు.
తమకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం కావాలని తెలుగుదేశం పార్టీ మరో నేత మహేందర్ రెడ్డి అన్నారు. సీమాంద్రులు హైదరాబాద్‌లో ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చునని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications