వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావూరికి పదవిచ్చి, హరికి ఆమోదమా: రిజైన్‌పై రమేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 CM Ramesh questions about Harikrishna's resignation
హైదరాబాద్: గతంలో కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తే మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు తమ పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించడమేమిటని తెలుగుదేశం పార్టీ ఎంపి సిఎం రమేష్ ప్రశ్నించారు.

హరికృష్ణ రాజీనామా ఆమోదం వెనుక కాంగ్రెసు పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తమ పార్టీనే టార్గెట్ చేస్తుందన్నారు. హరి రాజీనామాను ఆమోదించి తమ పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఆ పార్టీ చేసిందన్నారు. హరికృష్ణ సమైక్య యాత్ర కేవలం మీడియా సృష్టి అన్నారు.

ఎపిఎన్జీవోలో సీమాంధ్ర నేతల సమావేశం

హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న సీమాంధ్రులు ఎపిఎన్జీవో భవన్‌లో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 7వ తేదిన ఎల్పీ స్టేడియంలో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించారు. పలు కాలనీలలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలంతా సభకు తరలి వచ్చి సమైక్యవాణిని వినిపించాలని కోరారు.

భారీ ఉద్యమం చేస్తే తప్ప ఉపయోగం లేదన్నారు. ప్రజలంతా ఒక్కతాటి పైకి వచ్చి సంఘటిత శక్తిని చాటాలన్నారు. జంట నగరాలలో 40 లక్షల మంది సీమాంధ్రులు ఉన్నారని, వారంతా భాగస్వాములు కావాలన్నారు.

English summary
Telugudesam Party senior MP CM Ramesh questioned Congress about Nandamuri Harikrishna resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X