లక్నో విమానాశ్రయంలో విహెచ్‌పి అశోక్ సింఘాల్ అరెస్ట్
లక్నో: విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆదివారం ఉదయం లక్నో విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ రోజు నుండి సెప్టెంబర్ 13వ తేది వరకు ఉత్తర ప్రదేశ్‌లో విహెచ్‌పి కోసీ పరిక్రమ యాత్రకు ఉపక్రమించారు. దీనికి పోలీసులు అనుమతిని నిరాకరించారు.
ఈ రోజు యాత్ర నేపథ్యంలో పలువురు విహెచ్‌పి నేతలు, సాధువులు అయోధ్యకు బయలుదేరారు. అశోక్ సింఘాల్‌ను యుపి పోలీసులు లక్నో విమానాశ్రయంలో, మహంత గోపాల్ దాస్‌ను అయోధ్యలో, ఇతర నేతలను కూడా ఆయా ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.

ఫైజాబాద్, అయోధ్య జిల్లాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కోసి పరిక్రమ యాత్ర నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 144వ సెక్షన్ విధించారు. విహెచ్‌పి యాత్రకు పట్టుగా ఉండటం, పోలీసులు అరెస్టులు చేస్తుండటం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ రణరంగంగా మారింది.
కోసి పరిక్రమ యాత్రను అడ్డుకునేందుకు ముందు నుండే అయోధ్య, ఫైజాబాద్‌ల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. శనివారమే 50 మంది విహెచ్‌పి కార్యకర్తలను అరెస్టు చేయడమే కాకుండా తొగాడియా, రామ్ విలాస్ వేదాంతి వంటి 300పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ రోజు అందులో పలువురిని అరెస్టు చేశారు. అయోధ్య చుట్టుపక్కల ఉన్న విహెచ్‌పి నాయకుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications