విభజనపై మళ్లీ కిరణ్ సంచలనం: గవర్నర్‌కి గంటా రిజైన్

రాయలసీమ, రైతుల సమస్యలను తీర్చాకే విభజనపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రం లోతుగా వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని కోరారు. విడిపోతే రాయలసీమలో సంక్షోభం తలెత్తడం ఖాయమన్నారు. తాను తన స్వార్థం కోసం సమైక్యాంధ్ర అనడం లేదని, ప్రజల ఇబ్బందుల దృష్ట్యానే అలా చెబుతున్నానని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఓ ప్రాంతానికి మంత్రులుగా ఉండలేం: గంటా, ఏరాసు
తాము ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఓ ప్రాంతానికి మంత్రులుగా ఉండదల్చుకోలేదని మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు అన్నారు. వారు తమ రాజీనామా పత్రాలను గవర్నర్ నరసింహన్‌కు ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని, గవర్నర్‌కు రాజీనామా లేఖలు ఇచ్చామన్నారు. వాటిని ముఖ్యమంత్రికి పంపిస్తానని చెప్పారన్నారు.
తాము అంతకుముందు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని చెప్పారని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవసరముందని కిరణ్ అన్నారని, విభజన నిర్ణయం తీసుకుంటే రాజీనామా చేస్తామని తాము ముందే చెప్పామన్నారు.












Click it and Unblock the Notifications