సిక్కుల ఊచకోత: సోనియాకు అమెరికా కోర్టు సమన్లు

సోనియా గాంధీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమె ఇటీవలే అమెరికా వచ్చారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అమెరికా చట్టాల ప్రకారం సమన్లను వ్యక్తిగతంగా అందించాల్సి ఉంటుంది.
దాదాపు 30 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం అమెరికాలో ఉన్న సమయంలో సమన్లు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని, నిస్సందేహంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.
గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, కేంద్ర మంత్రి కమల్‌నాథ్ విషయంలో కూడా సిక్స్ రైట్ గ్రూప్ ఇటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. రాజీవ్ గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో వందలాది మంది సిక్కులు హత్యకు గురయ్యారు.












Click it and Unblock the Notifications