విశాఖవాసులకు శుభవార్త.. దేశంలోనే తొలిసారి అక్కడ వెయిటింగ్‌ లాంజ్‌లు!

విశాఖపట్నం నగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఇదే తొలిసారిగా ఎయిర్‌పోర్టు సంబంధిత వెయిటింగ్ లాంజ్‌లను నగరంలోని తొమ్మిది చోట్ల ఏర్పాటు చేయనున్నారు. జీఎంఆర్ సంస్థ ఈ ప్రతిపాదనకు సమ్మతం తెలిపింది. ఇది అమలులోకి వస్తే విమానం ప్రయాణం చేసే వారికి ఎంతో సౌకర్యం కలుగుతుంది.

విశాఖలో నగర వ్యాప్తంగా వెయిటింగ్ లాంజ్‌లు ఏర్పాటు

సాధారణంగా విమానాశ్రయాల లోపల మాత్రమే వెయిటింగ్ లాంజ్‌లు ఉంటాయి. కానీ విశాఖలో మాత్రం నగర వ్యాప్తంగా లాంజ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరి విమాన సమయం వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. ముందుగా ఐదు లాంజ్‌లను ప్రారంభించి, తర్వాత మిగిలినవి కూడా ఏర్పాటు చేయనున్నారు. లాంజ్‌ల నిర్మాణం కోసం ముంబైలోని కంటైనర్లను ఇప్పటికే ఆర్డర్ చేశారు.

Visakhapatnam Gets Nine Waiting Lounges for Bhogapuram Airport Passengers A First in India

భోగాపురం ఎయిర్ పోర్ట్ వెళ్లాల్సిన ప్రయాణికులకు యూజ్ ఫుల్ గా వెయిటింగ్ లాంజ్ లు

విద్యుత్, నీటి సౌకర్యాలు, మరిన్ని సౌకర్యాలను జీవీఎంసీ అందిస్తుంది. భోగాపురం వెళ్లాల్సిన ప్రయాణికులు సమీప లాంజ్‌కు వెళ్లి అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. ఇంధన పొదుపు దృష్ట్యా మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్రణాళిక. ఇప్పటికే 20 బస్సులు ఆర్టీసీకి అందాయి. వాటి ట్రయల్ రన్‌లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.

భోగాపురం విమానాశ్రయం కోసం భారీ ఏర్పాట్లు

ఈ బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇది కాకుండా భోగాపురం విమానాశ్రయం సమీపంలో కార్గో సేవలు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభించాలని ఏపీ ట్రావెలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. యూరప్, గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడపాలని జీఎంఆర్‌ను కోరింది.జులై 9 నుంచి విశాఖపట్నం విమానాశ్రయం పూర్తిగా నేవీ ఆధీనంలోకి వెళ్లనుంది.

రాష్ట్ర చరిత్రలో తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా ట్రాన్స్ జెండర్
రాష్ట్ర చరిత్రలో తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా ట్రాన్స్ జెండర్

ఏపీలో విమానరంగా అభివృద్ధికి కీలక అడుగు

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జులై 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావొచ్చు. జులై 8 నుంచి 'స్కూట్' ఎయిర్‌లైన్స్ సేవలు మొదలవుతాయి. ఈ కొత్త సౌకర్యాలు విశాఖ నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించి, మొత్తం ఎయిర్ ట్రావెల్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఇది ఏపీలో విమానయాన రంగం అభివృద్ధికి ఒక ముఖ్యమైన అడుగు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+