Amaravati: అమరావతి నాడు-నేడు..! అంబటి ఎమోషనల్ సాంగ్..!

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇవాళ అమరావతి (Amaravati) రాజధానిపై ఓ పాటను విడుదల చేశారు. అమరావతిని నాడు-నేడుగా పేర్కొంటూ తయారు చేసిన ఈ పాటలో ఈ ప్రాంత గత వైభవంతో పాటు ప్రస్తుతం కూటమి పాలనలో పరిస్ధితుల్ని పోల్చి చూపారు. సహజంగానే అమరావతి రాజధానిని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. అంబటి రాంబాబు రాష్ట్రంలో ప్రజలకు తమ వాదన వినిపించేలా దీన్ని తయారు చేయించినట్లు తెలుస్తోంది.

అమరావతి గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు, శాతవాహనుల కాలంలో ఎలా విరాజిల్లిందో ఈ పాటలో వివరించారు. అప్పట్లో ఇక్కడి కట్టడాలు, ఈ ప్రాంతంలో రాజుల పాలనా కాలంలో వైభవం, ఇతర చారిత్రక అంశాల్ని ఈ పాటలో ఉన్న చరణాలలో ప్రస్తావించారు. తద్వారా గతంలో అమరావతి ప్రాంత వైభవాన్ని ప్రజలకు గుర్తుచేశారు. మరోవైపు ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఈ ప్రాంతం ఎలా మారిపోతోందో కూడా చూపించేలా ఈ పాట ఉంది.

Amaravati Then and Now Ambati Rambabu s Emotional Song Takes Social Media by Storm

ముఖ్యంగా కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో అమరావతిలో ప్రాంతాలు, పొలాలు, రోడ్లు మునిగిపోయి కనిపిస్తున్న దృశ్యాలు, ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్, ఇతర వివరాలను కూడా ఇందులో అంబటి రాంబాబు ప్రస్తావించారు. అయితే ఈ పాటలో నేరుగా అంబటి రాంబాబు ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు కూడా. ప్రైవేటు గా ఈ పాటను తయారు చేయించి విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అంబటి ఎక్స్ లో ట్వీట్ కూడా చేశారు. అమరావతిపై తన పాట చూడాలంటూ అంబటి రాంబాబు ఇందులో ప్రజల్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+