అమెరికాలో భాగంగానే హర్మూజ్‌ జలసంధి.. సంచలన ఫొటో షేర్‌ చేసిన ట్రంప్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఫొటో షేర్ చేశారు. అందులో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి.. అమెరికాలో భాగంగానే ఉంది. హార్మూజ్ ఇకపై 'అమెరికాకు చెందిన కొత్త భూభాగం' అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన అధికారిక సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.

ఇకపై వాషింగ్టన్ కు హార్మూజ్ జలసంధిపై పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉంటుందని స్పష్టం చేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఇరాన్ కు చెందిన ప్రముఖ మీడియేటర్ మహమ్మద్ బాగేర్ గలీబఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ డిమాండ్స్ ను అమెరికా అంగీకరించేంత వరకూ హార్మూజ్ జలసంధి మూసివేసి ఉంటుందని తెలిపారు. మహమ్మద్ బాగేర్ గలీబఫ్ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ ఫొటోను పోస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

" నేను ఒక విషయాన్ని వివరంగా ధ్రువీకరించదలచుకున్నాను. ఎంఓయూలో పేర్కొన్న డిమాండ్స్ కు అమెరికా అంగీకారం తెలిపేంత వరకూ ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి తెరిచే ఉంటుంది" అని మహమ్మద్ బాగేర్ గలీబఫ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అలాగే హార్మూజ్ జలసంధిపై దిగ్బంధాన్ని తొలగించడం.. చమురు రవాణాపై ఆంక్షలను ఎత్తివేయడం.. విదేశాలలో నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం.. తదితర అంశాలను ఇరాన్ కోరుతోందని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయాలను ఇటీవల జూన్ లో జరిగిన ఇరాన్- అమెరికా ఎంఓయూలో పేర్కొన్నట్లు తెలిపారు. అయితే ఆ ఒప్పందం తర్వాత విఫలం అయిందని వెల్లడించారు. ఇక ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధిని అమెరికా దిగ్బంధనం చేసింది. ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్య రవాణాలో కీలకంగా ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రంతో కనెక్టింగ్ చేస్తుంది. అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్మూజ్ పై ఇరాన్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. హార్మూజ్ గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేస్తోంది. అయితే ఇరాన్ వైఖరిని అమెరికాతోపాటు అనేక దేశాలు తప్పుబట్టాయి.

Trump shares sensational photo of the Strait of Hormuz as part of the US Strait of Hormuz iran news

ఇక ఇరాన్, ఒమన్ రెండు దేశాలకూ హార్మూజ్ జలసంధి తీర ప్రాంతంగా ఉంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య నేవిగేషన్, షిప్పింగ్ లో అవగాహన ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒమన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం విషయంలో ఒమన్ జోక్యం చేసుకుంటే ఆ దేశంపై మిలిటరీ యాక్షన్ ను చేపడతామని హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి విషయంలో ఒమన్- ఇరాన్ ఒప్పందంపై ఈ మేరకు ట్రంప్ మండిపడ్డారు. అంతేకాక ఇరాన్ మొత్తం అమెరికాకు సరెండర్ కావాలని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+