ChatGPT మిమ్మల్ని చూస్తుంది, వింటుంది, గుర్తుపెట్టుకుంటుంది..! ఆల్ట్ మన్ సంచలనం..!

ఇప్పటికే తన అప్ డేట్స్, ఫీచర్లతో యూజర్లలో దూసుకుపోతున్న ఏఐ ప్లాట్ ఫామ్ ఛాట్ జీపీటీ (Chatgpt) రాబోయే పోటీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు అత్యాధునిక ఫీచర్లను తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఓపెన్ ఏఐ (Open AI) సీఈఓ శామ్ ఆల్ట్ మెన్ (Sam ALtman) వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లోనే తమ ఛాట్ జీపీటీ ఎలా మారిపోబోతోందో ఆయన వెల్లడించారు. ముఖ్యంగా సంప్రదాయ ఏఐ ప్లాట్ ఫామ్స్ ను దాటిపోయి ఛాట్ జీపీటీ ఏం చేయగలదో ఆల్ట్ మెన్ వివరించారు.

ఛాట్ జీపీటీ త్వరలోనే మీ కంప్యూటర్ స్క్రీన్‌ను, మీరు పాల్గొనే సమావేశాలను, కాల్స్‌ను గమనిస్తూ, ప్రతిదీ నిరంతరం రికార్డ్ చేయగలదని ఆల్ట్ మెన్ తెలిపారు. ఓ వ్యక్తి తన కంప్యూటర్‌లో ఏం చేస్తున్నారో నిరంతరం అర్థం చేసుకుని, ఆ సందర్భాన్ని ఉపయోగించి రోజంతా వారికి సహాయం చేయగలదన్నారు. మీరు ఈమెయిల్, టెక్స్ట్‌లు, డాక్యుమెంట్‌లు, స్లాక్ వంటి సేవలను కూడా దీనికి సులభంగా కనెక్ట్ చేయవచ్చన్నారు. ఈ భవిష్యత్ వెర్షన్ వినడానికి బాగున్నా.. నిఘా కోణంలో భయానకంగా ఉండబోతోందన్నది ఆల్ట్ మెన్ మాటల ద్వారా అర్దమవుతోంది.

ChatGPT Could Soon Watch Listen and Remember Your Life Sam Altman Says

దీనిపై స్పందిస్తూ ఆల్ట్ మెన్.. AI ఏ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతించబడుతుందో యూజర్లే నిర్ణయిస్తారని తెలిపారు. యూజర్ కోసం నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా ఏఐ వారితో కలిసి పనిచేస్తూ, ఆ విస్తృతమైన సందర్భాన్ని ఉపయోగించి సూచనలు ఇవ్వడం లేదా చిన్న పనులను చూసుకోవడం చేస్తుందన్నారు. మీరు ఒక స్టార్టప్ సీఈఓ లాంటి వారైతే, మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ పనులు ఎప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మ్యాక్ లోని ఛాట్ జీపీటీ డెస్క్ టాప్ యాప్ కోసం ఓపెన్ ఏఐ.. కంప్యూటర్ హిస్టరీ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో ఆల్ట్ మెన్ తాజా వివరాలు వెల్లడించారు. ఈ ఫీచర్ తమ యాప్‌లు, వెబ్‌సైట్‌లలోని కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఛాట్ జీపీటీకి వీలు కల్పిస్తుంది. తద్వారా ఒక యూజర్ ఏమి చేస్తున్నారనే దాని గురించి దానికి మరింత సందర్భోచిత సమాచారం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+