ChatGPT Images 2.0: ఛాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 రిలీజ్-అరచేతిలో అద్భుత చిత్రాలు..!

ఏఐ ద్వారా ప్రస్తుతం ఉన్న ఫొటోల కంటే అద్బుతమైన చిత్రాలు అందించేందుకు ఛాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 (ChatGPT Images 2.0) విడుదలైంది. ఓపెన్ ఏఐ ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్ ను రిలీజ్ చేసింది. దీన్ని ChatGPT, Codex, దాని అంతటా అందుబాటులో ఉంది. డిజైన్, ప్రజెంటేషన్లు, కంటెంట్ క్రియేషన్ వంటి పనుల కోసం మరింత కచ్చితమైన, వివరణాత్మకమైన ఫొటోల్ని రూపొందించడానికి ఇందులో వీలు కల్పిస్తున్నారు. ఈ కొత్త మోడల్ కేవలం సాధారణ దృశ్య ప్రయోగాలకు భిన్నంగా, రోజువారీ ఉపయోగం కోసం ఇమేజ్ జనరేషన్‌ను మరింత ఆచరణాత్మకంగా మార్చేందుకు ఉపయోగపడుతుందని ఓపెన్ ఏఐ తెలిపింది. వెబ్ డేటాను వాడుకుని ఒకే ప్రాంప్ట్ నుండి బహుళ అవుట్‌పుట్‌లు ఇస్తుంది.


ChatGPT Images 2.0లో కొత్త ఫీచర్లు ఇవే..!

మెరుగైన ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలు Images 2.0లో అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్ వివరణాత్మక సూచనలను బాగా అర్థం చేసుకుని, మరింత కచ్చితత్వంతో చిత్రాలను సృష్టించగలదని ఓపెన్ ఏఐ చెబుతోంది. చిన్న టెక్స్ట్, రేఖాచిత్రాలు, యూఐ కాంపోనెంట్‌లు, దట్టమైన లేఅవుట్‌ల వంటి సంక్లిష్ట అంశాలను గతం కంటే మరింత సమర్థవంతంగా నిర్వహించగలదు. ఈ మోడల్ ఒక చిత్రంలో వస్తువులను మరింత కచ్చితంగా ఉంచడానికి, బహుళ భాషల్లో అందబాటులో ఉంటుంది. ఇందులో మరో అప్డేట 3:1 నుండి 1:3 వరకు విస్తృత శ్రేణి యాస్పెక్ట్ రేషియోల ఇమేజ్ లను సృష్టిస్తుంది. దీనివల్ల బ్యానర్లు, పోస్టర్లు, స్లైడ్‌లు, మొబైల్ కంటెంట్‌తో సహా వివిధ ఫార్మాట్‌లకు సరిపోయే చిత్రాలను సృష్టించడం సులభం అవుతుంది. అలాగే ఈ కొత్త అప్‌డేట్ ChatGPTలో "ఆలోచనా-సామర్థ్యం గల" వర్క్‌ఫ్లోలను అందిస్తుంది. ఇది ఫొటోల్ని రూపొందించే ముందు ఒక పనిని లాజిక్ తో పూర్తి చేయడానికి సిస్టమ్‌ను అనుమతిస్తుంది.

OpenAI Unveils Images 2 0 ChatGPT Can Now Generate Richer More Detailed Multi-Image Results

ఒకే రిక్వెస్ట్ తో 8 ఫొటోలు

ఛాట్ జీపీటీ ఇమేజెస్ 2.0లో వినియోగదారులు ఇప్పుడు ఒకే ప్రాంప్ట్ తో 8 వరకు చిత్రాలను అందుకోవచ్చు. ప్రతి వైవిధ్యానికి ప్రత్యేక ప్రాంప్ట్‌లు అవసరం లేకుండా స్టోరీబోర్డ్‌లు, పోస్టర్ సెట్‌లు, మాంగా-శైలి పేజీలు లేదా బహుళ-ఫార్మాట్ ప్రచారాలను రూపొందించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. OpenAI, gpt-image-2 అని పిలువబడే ఇంటర్నల్ మోడల్‌ను కూడా తన ఏపీఐ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇది డెవలపర్‌లు ఇమేజ్ జనరేషన్ , ఎడిటింగ్ ఫీచర్‌లను నేరుగా వారి యాప్‌లు , వర్క్‌ఫ్లోలలోకి ఇంటిగ్రేట్ చేయడానికి అనుమతిస్తుంది.

OpenAI Unveils Images 2 0 ChatGPT Can Now Generate Richer More Detailed Multi-Image Results


భద్రతా మార్గదర్శకాలు

ఓపెన్‌ఏఐ ప్రకారం, ఇమేజెస్ 2.0 కోసం రూపొందించిన భద్రతా వ్యవస్థ, గత మోడల్ లాగే అదే పునాదిపై నిర్మించారు. అయితే మరింత అధునాతన సామర్థ్యాల వల్ల తలెత్తే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇందులో అదనపు భద్రతా చర్యలు చేర్చారు. ఇమేజెస్ 2.0 గత వెర్షన్‌ల కంటే మరింత వాస్తవికమైన చిత్రాలను సృష్టిస్తుంది. దీనివల్ల, నిజమైన వ్యక్తులు, ప్రదేశాలు లేదా సంఘటనలకు సంబంధించిన తప్పుదారి పట్టించే లేదా సున్నితమైన చిత్రాలను రూపొందించడం వంటి దుర్వినియోగ ప్రమాదం పెరగవచ్చు. దీనిని నివారించడానికి కఠినమైన భద్రతా నియమాలను అమలు చేశామని చెబుతోంది. ఈ వ్యవస్థ ఫొటోల్ని రూపొందించడానికి ముందు రిక్వెస్ట్ లను ప్రమాదకరమైన ఇన్‌పుట్ చిత్రాలను ఫిల్టర్ చేస్తుంది మరియు తుది అవుట్‌పుట్ విధానాలను అనుసరిస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి సమీక్షిస్తుంది.హింస, లైంగిక కంటెంట్ వంటి కంటెంట్‌ను సృష్టించడానికి ప్రయత్నించే ప్రాంప్ట్‌లను నిరోధించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+