అసెంబ్లీలోకి భార్యకు నో: గేటువద్ద టిడిపి ఎమ్మెల్యే ధర్నా

భార్యను తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో లింగారెడ్డి తన భార్యతో కలిసి శాసన సభ గేటు ముందు ధర్నాకు దిగారు. ఆయన మాట్లాడుతూ.. తన భార్యతో కలిసి తాను వస్తుంటే పోలీసులు ఆపేశారని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు ఒక్కరే వాహనంలో వస్తే అతడిని లోపలకు అనుమతించారని ఆరోపించారు.
ఒక తెలంగాణ ఎమ్మెల్యే పిఏను అనుమతించిన పోలీసులు తన భార్యను అనుమతించకుండా వివక్ష చూపారన్నారు. జై సమైక్యాంధ్ర అంటూ శాసన సభ గేటు వద్ద ధర్నా చేశారు. కొద్ది సేపటికి పోలీసులు అతడిని అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత భార్యను అరెస్టు చేశారు. ఇద్దరిని సాయంత్రం విడుదల చేశారు.
అసెంబ్లీ గేటు వద్ద తెరాస దీక్ష
అసెంబ్లీ గేటు వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఆరు గంటల పాటు దీక్ష చేశారు. వారికి భారతీయ జనతా పార్టీ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ మంత్రి శంకర రావులు సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications