అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

3 రోజులు వర్షాలు, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం అండమాన్ నికోబార్ తీరం, థాయ్‌లాండ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ... ఈ నెల 15న వాయుగుండంగా మారింది. వాయుగుండం మరింత బలపడి 17 తేదికి తుఫాన్‌‌గా మారింది. ఇది ఏపీలో తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి, 19వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఏపీ తీరానికి కొద్దీ దూరంలో వాయుగుండం ఉంది. ఈ తుఫాన్‌కి "జవాద్‌"గా నామకరణం చేశారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టం చాలా జరిగింది. ఈ తుఫాను కారణంగా మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని వివరించారు.

72 hours rain will lashes andhra pradesh

వాస్తవానికి చలికాలం వచ్చినా.. వింత వాతావరణ పరిస్థితి ఉంది. ఇటు చలి పెట్టడం లేదు. అటు ఎండ లేదు.. కానీ ఉక్క పోత మాత్రం ఎక్కువే ఉంది. దీనికితోడు.. అల్పపీడనం, వాయుగుండాలు ఏర్పడి.. అన్నదాత గుండె గుబేల్ అనిపిస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తోన్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. కానీ తుపానులు, అల్పపీడనలు ఏర్పడుతున్నాయి. దీంతో రైతన్న బిక్కు బిక్కుమంటున్నాడు.

మళ్లీ అల్పపీడనం ఏర్పడటంతో రైతన్న ఆందోళన చెందతున్నాడు. పంట కోయడం, విక్రయించడం ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. తమ పట్ల ప్రభుత్వాలే కాదు.. వాతావరణం కూడా పగబట్టిందని వివరించారు.

English summary
72 hours rain will lashes the andhra pradesh weather officials said in the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X