కేసీఆర్ మన ఆస్తులను లాక్కుంటున్నాడు..జగన్ కు ఓటేస్తే అంతే: చంద్రబాబు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వైసిపి అధినేత జగన్ పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన వాళ్ల ఆస్తులను లాక్కుంటున్నారని..నేను సంపాదించిన ఆస్తులను అనుభవి స్తూ మన మీదే కుట్రలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ కి ఓటు వేస్తే సంక్షేమ పధకాలు నిలిచిపోతాయని హెచ్చరించారు. ఏపి ప్రజలు పౌరుషం చాటాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్ కక్ష్య కట్టారు..
ఏపీపై కేసీఆర్ కక్ష కట్టారని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్ మన ఆస్తులన్నీ లాక్కున్నాడు. ఏపీకి రావాల్సిన నిధులను ఇవ్వలేదు. జగన్‌ను ఓ పావులా వాడుకుంటున్నాడు. అలాంటి జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన కష్టం ఉందన్న చంద్రబాబు.. తాను సంపాదించిన ఆస్తులను కేసీఆర్ అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అండగా ఉంటారని ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. హామీలు అమలు చేయకుండా కేంద్రం మోసం చేసిందన్నారు. కేంద్రం సహకరించకపోయినా.. కష్టపడి పెట్టుబడులు తీసుకువచ్చానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నానని వివరించారు. ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ‘‘మీ భవిష్యత్ నా బాధ్యత''గా పనిచేస్తున్నానని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పెంచానని చెప్పుకొచ్చారు.

జగన్ నేరాల్లో పిహెచ్‌డి చేసారు..
జగన్ ది నేర చరిత్ర అంటూ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. జగన్ విద్యార్హతపైనా విమర్శలు సంధించారు. జగన్ ఏమైనా చదువుకున్నారా? అని ప్రశ్నించారు. ఎక్కడ చదువుకున్నాడో కూడా జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు.
జగన్ ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నారని..ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. జగన్ కు అవకాశం ఇస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఏపి ప్రజల ఆత్మగౌరవం పై దెబ్బ కొట్టారని..అటువంటి వారితో జగన్ కలిసి పని చేస్తున్నారని వివరించారు. మనకు పౌరుషం లేదా..మన ఆత్మగౌరవం ముఖ్యం కాదా అంటూ ప్రసంగం కొనసాగిం చారు. వివేకా హత్య కేసులో జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పారని..తాము చేసి చూపించామని చంద్రబాబు వివరించారు. మైనార్టీలు జగన్ కు ఓటు వేస్తే అది మోదీకి వేసినట్లేనని పేర్కొన్నారు.

జగన్ గెలిస్తే సంక్షేమం అగిపోతుంది..
జగన్ కు అవకాశం ఇస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పధకాలు నిలిచిపోతాయన్నారు. పెన్షన్లు..పసుపు కుంకు మ ను ఆపేస్తారన్నారు. ఏపికి నీళ్లు కూడా రావని..జగన్ అధికారంలోకి వస్తే అక్రమాలు..నేరాలు మొదలవుతాయంటూ చెప్పుకొచ్చారు. జగన్‌కు ఓటేస్తే.. మన మరణశాసనం మనమే రాసుకున్నట్లు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 16 సీట్ల లో గెలిచి చక్రం తిప్పుతానంటుంటే..మనకు పౌరుషం లేదా అన్ని ప్రశ్నించారు. నవ్యాంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపా డేలా తాను వ్యవహరిస్తానని..తనకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications