అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాపై వెనక్కి తగ్గిన దివ్యవాణి.. బచ్చుల అర్జునుడు రంగంలోకి దిగడంతో..

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని దివ్యవాణి రాజీనామాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రాజీనామా చేయడానికి గల కారణాలు తెలియలేదు. ట్వీట్ చేశారు.. ఆ తర్వాత డిలేట్ చేశారు. అయితే దివ్యవాణితో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడారు. దీంతో రాజీనామాపై దివ్యవాణి వెనక్కి తగ్గారు.

గుర్తింపు దక్కడం లేదు..

గుర్తింపు దక్కడం లేదు..


టీడీపీలో గుర్తింపు దక్కడం లేదని పార్టీకి తాను రాజీనామా చేస్తున్న‌ానని ఉదయం దివ్యవాణి పోస్ట్ చేశారు. ఆమె తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికార ప్ర‌తినిధిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత టీడీపీని వీడే ప్ర‌సక్తే లేదని స్ప‌ష్టం చేశారు. ఇవాళ సాయంత్రం మంగ‌ళ‌గిరిలో గల పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడ‌తారు. ఏ అంశాలపై మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.

రంగంలోకి బచ్చుల అర్జునుడు

రంగంలోకి బచ్చుల అర్జునుడు


ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు బ‌చ్చుల అర్జునుడు రంగంలోకి దిగారు. దివ్య‌వాణితో మాట్లాడి ఒప్పించారు. అర్జునుడితో మాట్లాడిన తర్వాత త‌న నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. టీడీపీని వీడేది లేద‌ని ప్ర‌క‌టించారు. రాజీనామా చేస్తున్న‌ ట్వీట్‌ తొల‌గించారు. టీడీపీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసే మీడియా స‌మావేశంలో దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌ే అవకాశం ఉంది.

ఫైర్ బ్రాండే

ఫైర్ బ్రాండే


సినీ నటి, టీడీపీ నేత అయినత దివ్యవాణి పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా కొనసాగుతున్నారు. అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. యాక్టివ్‌గా ఉంటున్నారు.. ఇంతలో రాజీనామా చేయడం.. ఆ వెంటనే విత్ డ్రా చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆమె రాజీనామాస్త్రానికి గల కారణం మాత్రం తెలియరాలేదు.

English summary
leader divyavani withdraw her resignation. arjunudu talk to her and convinced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X