అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండపాలకు రుసుం తీసుకోవడం లేదు.. అడిగితే చర్యలు: దేవదాయశాఖ

|
Google Oneindia TeluguNews

గణనాథుడి పండగ వచ్చేస్తోంది. అదే వినాయక చవితి.. మాస్టర్ ఆఫ్ గాడ్‌ను కొలిచేందుకు భక్తులు సర్వం సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఏపీలో ఆంక్షలు అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై దేవదాయ శాఖ వివరణ ఇచ్చింది. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో నిజం లేదని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ వెల్లడించారు.

వినాయకచవితి మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. గణేశ్ మండపాలు ఏర్పాటు చేయాల్సిన వారు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రందించాలని సూచించారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. అంతకుమించి ఎలాంటి రుసుం గానీ, చందాలు గానీ తీసుకున్నా, అందుకు ప్రేరేపించినా... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

wrong campaign on ganesh mandapas in state endowment commissioner said to media

వినాయక మండపాలకు రుసుం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందితే, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. రుసుం వసూలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసినా.. చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. అసత్య, నిరాధార ప్రచారాలను ప్రజలు, భక్తులు నమ్మొద్దని కోరారు.

అయితే రంగుల వినాయకుడితో పర్యావరణానికి కీడు జరగనుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వల్ల నష్టమే... ఆ రంగుల వల్ల తేలికగా నీటిలో కరగవు.. ఒకవేళ కరిగినా... వాతావరణాన్ని కలుషితం చేస్తుంటాయి. అందుకే మట్టి గణనాథులను కొలుద్దాం అని పర్యావరణ వేత్తలు కోరుతుంటారు.

English summary
wrong campaign on ganesh mandapas in state endowment commissioner said to media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X