తనయుడికి బదులు తండ్రి! వైఎస్ఆర్ సీపీ పర్చూరు అభ్యర్థిత్వంలో అనూహ్య మార్పు
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వంలో హఠాత్తుగా మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేయబోతున్న సమయంలో.. ఈ మార్పు చోటు చేసుకుంది. పర్చూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో మొదట దగ్గుబాటి హితేష్ ను బరిలో దింపాలని భావించారు. దీనికోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
హితేష్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. అనూహ్యంగా హితేష్ స్థానంలో ఆయన తండ్రి, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగానే పేరున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. హితేష్ కు బదులగా వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఢీ కొట్టడానికి వెంకటేశ్వరరావే సరైన అభ్యర్థి అని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి కూడా తెప్పించుకున్న సర్వే నివేదికల్లో కూడా ఈ విషయమే తేలినట్లు స్పష్టమైంది.

హితేష్ కంటే కూడా ఆయన తండ్రిని అభ్యర్థిగా నిలబెట్టి, గెలిపించుకోగలిగితే.. అసెంబ్లీలోనూ జగన్ కు సహాయకారిగా ఉంటారనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. వెంకటేశ్వరరావును మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని కూడా చెబుతున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయానా తోడల్లుడు. ఆయన గుట్టమట్లు అన్నీ వెంకటేశ్వరరావుకు తెలుసనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేయడానికి చంద్రబాబు చేసిన కుట్రలపై వెంకటేశ్వరరావు ఇదివరకే ఓ పుస్తకాన్ని కూడా ముద్రించారు.

అలాంటి నాయకుడిని అసెంబ్లీలో చోటు కల్పిస్తే.. వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడంలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవచ్చని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీనితో హితేష్ స్థానంలో వెంకటేశ్వరరావు పేరును తెరమీదికి తీసుకొచ్చారు. కాగా, హితేష్ ను శాసన మండలికి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications