గంధం చంద్రుడిపై కేతిరెడ్డి కామెంట్స్: భగ్గుమన్న దళిత సమాజం, మిన్నంటిన నిరసనలు
అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. దళితులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయాన్ని పై స్థాయి వరకు తీసుకెళతామని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు
గంధం చంద్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపై దళిత సమాజం భగ్గుమంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. దళితులు ఏకతాటిపైకొచ్చి సోషల్ మీడియాలో కలెక్టర్ గంధం చంద్రుడుకు అండగా నిలుస్తున్నారు.

రాజీనామా చేయాలని..
కేతిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేతిరెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని అక్కడ దళిత వర్గానికి చెందిన అభ్యర్థిని నిలుపుతామని అతనిపై గెలవాలంటూ సవాల్ విసురుతున్నారు. గంధం చంద్రుడు మరో జిల్లాకు వెళ్లినా ఆయన కలెక్టర్ హోదాలోనే ఉంటారని అదే కేతిరెడ్డి మరో నియోజకవర్గంకు వెళ్లి పోటీచేయగలరా అని ప్రశ్నిస్తున్నారు. గంధం చంద్రడు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలవగలరని అదే కేతిరెడ్డి రాజీనామా చేసి కలెక్టర్ కాగలరా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ నేతల మండిపాటు
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనగా ఎమ్మెల్యే కేతిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామని నాయకులు హెచ్చరించారు.

తప్పుపట్టిన వర్ల రామయ్య
కేతిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టారు. చంద్రుడు చాలా మంచి మనిషని, మానవతావాది అని తెలిపారు. అలాంటి వ్యక్తిపై కామెంట్లు సరికాదని స్పష్టంచేశారు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి చంద్రుడు అని వర్ల రామయ్య అన్నారు. కులాహంకారం, అధికార మదంతో ధర్మవరం ఎమ్మెల్యే దూషించడం, కించపరచడం సరికాదని చెప్పారు. బడుగువర్గాల పక్షాన నిలిచిన ఆయనను నిందించి కేతిరెడ్డి తప్పు చేశారని అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి పట్ల దారుణంగా వ్యవహరించిన ఘటనపై ఐఏఎస్ సంఘం స్పందించకపోవడం సరికాదన్నారు. విషయంలో సీఎం జగన్ కూడా మౌనంగా ఉంటారా అని ట్వీట్ చేశారు.

జగన్ స్పందన..
మరోవైపు దళిత సంఘాలు కూడా విషయాన్ని సీఎం జగన్‌కు తెలియజేస్తామని తెలిపారు. జగన్‌పై ఒత్తిడి తీసుకొస్తామని.. కేతిరెడ్డిపై చర్యల కోసం పోరాడుతామని వెల్లడించారు. దళితులు ఉన్నతస్థానంలో ఉంటే ఓర్వరా అని అడిగారు. ఎందుకు ఇలా కామెంట్స్ చేయడం.. ఓర్వలేనితనం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే తీరును అందరూ గమనిస్తున్నారని.. తగిన సమయంలో బుద్దిచెబుతారని పేర్కొన్నారు. అయితే దళిత సంఘాల ఒత్తిడిపై సీఎం జగన్ ఏ మేరకు స్పందిస్తారో చూడాలి మరి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications