ఏపీలో తగ్గిన కొత్త కరోనా కేసులు, టెస్టులు కూడా: పెరిగిన యాక్టవ్ కేసులు, చిత్తూరులో అత్యధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 70,727 నమూనాలను పరీక్షించగా.. 1843 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1843 కరోనా కేసులు, 12 మంది మృతి

ఏపీలో కొత్తగా 1843 కరోనా కేసులు, 12 మంది మృతి

తాజాగా నమోదైన 1843 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 12 మంది మృతి చెందారు. అత్యధికంగా ప్రకాశం జిల్లా ముగ్గురు మరణించగా, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,209 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 23వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 23వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,199 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,11,812కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 23,571 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,39,09,363 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 301 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 24 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే


ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 69, చిత్తూరులో 301, తూర్పుగోదావరిలో 222, గుంటూరులో 126, కడపలో 128, కృష్ణాలో 157, కర్నూలులో 24, నెల్లూరులో 203, ప్రకాశంలో 232, శ్రీకాకుళంలో 33, విశాఖపట్నంలో 84, విజయనగరంలో 29, పశ్చిమగోదావరిలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,74,651, చిత్తూరులో 2,28,212 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. కాగా, ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,231) కరోనా కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+