తెలంగాణలో మరో సమ్మె సైరన్: అర్ధరాత్రి నుంచి 108 సేవలు బంద్
హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణలో బుధవారం అర్ధరాత్రి నుంచి 108 ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. జీవీకే యాజమాన్యం, ఉద్యోగుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. వాటి నిర్వహణ నుంచి జివికెను తప్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
దాంతో సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘం ప్రతినిధులు తెలిపారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వేతన స్థిరీకరణ సహా 108 సర్వీసులను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు.

సమ్మెతో 108 ఉద్యోగుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా 300 వాహనాలు నిలిచిపోనున్నాయి. గతంలలో ఉద్యోగులు గతంలోనే సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మిక శాఖ కమిషనర్ అజయ్ సమక్షంలో ఇటీవల జరిగిన చర్చలు ఈ నెల 13వ తేదీ బుధవారానికి వాయిదా పడ్డాయి.
బుధవారంనాడు చర్చలు విఫలం కావడంతో అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగులు చెప్పారు.












Click it and Unblock the Notifications