ప్రత్యేక హోదా కోసం 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య, బాధాకరమని చంద్రబాబు
కర్నూలు: పాపిలి మండలం జలదుర్గం గ్రామంలో ప్రత్యేక హోదా కోరుతూ 14 ఏళ్ల బాలుడు మహేందర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లేఖలో ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నాడు.
మహేందర్ భౌతికకాయాన్ని పరామర్శించేందుకు కర్నూలు నుంచి హుటాహుటిన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కోట్ల సుజాతమ్మ, పీసీసీ నాయకులు బయలుదేరారు. హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని రఘువీరా కోరారు.

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించుకుందామన్నారు.
మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రఘువీరా రెడ్డి మాట్లాడారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి హోదాను సాధించుకుందామని చెప్పారు.

ఆత్మహత్యపై చంద్రబాబు
విద్యార్థి మహేందర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ వ్యూహ కమిటీతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని, హోదా కోసం నిండు జీవితాలను ఫణంగా పెట్టడం సరైనది కాదన్నారు.
ఎన్ని త్యాగాలు చేసినా కేంద్రంలో మాత్రం కదలిక లేదన్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతోందన్నారు. పోరాటం ద్వారానే హోదా సాధించుకుని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications