ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు,: 30వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 2వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 85,283 నమూనాలను పరీక్షించగా.. 2050 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2050 కరోనా కేసులు, 18 మంది మృతి

ఏపీలో కొత్తగా 2050 కరోనా కేసులు, 18 మంది మృతి


తాజాగా నమోదైన 2050 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,82,308కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 18 మంది మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా ఐదుగురు మరణించగా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,531 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 20వేల దిగువకు యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 20వేల దిగువకు యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,458 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,48,828కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 19,949 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,51,93,429 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 375 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు జిల్లాలో 23 మంది కరోనా బారినపడ్డారు.

Recommended Video

    Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu
    ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు


    ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 42, చిత్తూరులో 324, తూర్పుగోదావరిలో 375, గుంటూరులో 209, కడపలో 87, కృష్ణాలో 192, కర్నూలులో 23, నెల్లూరులో 221, ప్రకాశంలో 212, శ్రీకాకుళంలో 97, విశాఖపట్నంలో 93, విజయనగరంలో 30, పశ్చిమగోదావరిలో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,80,443, చిత్తూరులో 2,33,627 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,650) కరోనా కేసులున్నాయి. ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3, 19, 34, 455కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన 491 మంది చనిపోయారు. దీంతో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822కి చేరింది. కరోనా వైరస్ తగ్గడంతో 43,910 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వైరస్ కేసుల శాతం 1.27గా ఉంది. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. దేశంలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య 50.68 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 55,91,657 మంది టీకా తీసుకున్నారు. కాగా, వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+