ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: టెస్టులు కూడా, ఆ జిల్లాలో కొత్త కేసులు ‘0’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. ఓ రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువగా కేసులు ఉంటున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1000లోపే కేసులు నమోదయ్యాయి. అయితే, టెస్టులు కూడా తగ్గడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 43,594 నమూనాలను పరీక్షించగా.. 739 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 739 కరోనా కేసులు, 14 మంది మృతి

ఏపీలో కొత్తగా 739 కరోనా కేసులు, 14 మంది మృతి

తాజాగా నమోదైన 739 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,22,064కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 14 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,925కి పెరిగింది.

ఏపీలో 14,550 యాక్టివ్ కేసులు

ఏపీలో 14,550 యాక్టివ్ కేసులు


ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1333 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,93,589కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 14,550 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,69,82,681 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 166 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 03, చిత్తూరులో 166, తూర్పుగోదావరిలో 58, గుంటూరులో 66, కడపలో 98, కృష్ణాలో 64, కర్నూలులో 00, నెల్లూరులో 114, ప్రకాశంలో 94, శ్రీకాకుళంలో 11, విశాఖపట్నంలో 54, విజయనగరంలో 02, పశ్చిమగోదావరిలో 09 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,86,935, చిత్తూరులో 2,39,395 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,522) కరోనా కేసులున్నాయి.

దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా 40వేల పైనే నమోదవుతున్న కరోనా కేసులు ఇప్పుడు దిగివచ్చాయి. గత 24 గంటల వ్యవధిలో 38,948 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 219 మంది మరణించారు. ముందురోజుతో పోలిస్తే 8.9 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3.30 కోట్లు దాటింది. కరోనా బారినపడి 4,40,752 మంది మరణించారు. ఇక చాలా రోజుల తర్వాత కోలుకున్నవారి సంఖ్య కూడా పెరిగింది. గత 24 గంటల్లో 43,903 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ రేటు 97.44 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 4,04,874 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.23 శాతానికి చేరింది. ఇక ఆదివారం 25.23 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 68.75 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+