8వ తరగతి అమ్మాయి రేప్, హత్య: ఒంటిపై దుస్తులు లేకుండానే పడేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: విశాఖపట్నం కృష్ణరాయపట్నంలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక తనూజ దారుణ హత్యకు గురయింది. శనివారం సాయంత్రం అదృశ్యమైన అమ్మాయి, ఆదివారం ఉదయం శరీరంపై బట్టలు లేకుండా, నిర్జీవంగా ఓ చెత్తకుప్పలో కనిపించింది.

ఆమెను అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శరీరం పైన నూలు పోగు లేకపోవడంతో అనుమానం కలుగుతోందని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

8th class student murdered in Vishaka

నిర్జీవంగా చెత్తకుప్పలో పడి ఉన్న తన కూతురును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలం చేరుకున్నారు. ఆధారాలను సేకరిస్తున్నారు. విద్యార్థిని హత్య వెనుక కారణం ఏమిటో విచారణ జరపుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eight class student Tanuja murdered in Vishakapatnam on Saturday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి