పిక్చర్స్: ఫ్యామిలీ ఆత్మహత్య, విద్యార్థిని సూసైడ్‌యత్నం
వరంగల్/హైదరాబాద్: సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ బీటెక్ విద్యార్థిని గురువారం ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. రైలులో వెళ్తుండగానే బీటెక్ విద్యార్థిని స్వప్న తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేసింది. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి రైలును జనగాం రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. జనగాం స్టేషన్ రైల్వే అధికారులకు వారు సమాచారం అందించడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన స్వప్న పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో స్వప్నను వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, స్వప్న ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వెంట బంధువులు గానీ, స్నేహితులు లేకపోవడం గమనార్హం. స్వప్నను ఖమ్మం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు: కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాపేట పోలీస్ ష్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. ప్రవీణ్ కుమార్ (33), స్వాతి (28) దంపతులు లాలగూడ శాంతినగర్‌లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.
గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో గురువారం ఉదయం ఇద్దరు కుమార్తెలు అక్షయ కృప(3), వర్షిత(5)లకు ఉరివేశారు. అనంతరం ప్రవీణ్, స్వాతిలు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన చిన్నారి
ప్రవీణ్ కుమార్ (33), స్వాతి (28) దంపతులు, తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి సికింద్రాబాద్‌లోని లాలగూడ శాంతినగర్‌లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.

విగతజీవిగా ప్రవీణ్
గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ ఉద్యోగం లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాడు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ప్రవీణ్ భార్య స్వాతి
ఆర్థిక ఇబ్బందులు కారణంగా గురువారం ఉదయం ఇద్దరు కుమార్తెలు అక్షయ కృప(3), వర్షిత(5)లకు ఉరివేశారు. అనంతరం ప్రవీణ్, స్వాతిలు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రవీణ్ రెండో కూతురు మృతదేహంతో బంధువు
సికింద్రాబాద్ లాలాపేట పోలీస్ ష్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రవీణ్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం విషాధ ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications