AP: మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు.. హృదయాన్ని కదిలిస్తున్న కానిస్టేబుల్ గాధ..

గత ఆదివారం హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ఓ తాగుబోతు యువతి దుస్తులు లాగుతుంటే చూస్తూ ఉండిపోయారు. ఫొటోలు, వీడియో తీశారు కానీ ఘోరాన్ని మాత్రం ఆపలేదు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ దంపతులను ఫొటోలు, వీడియోలు తీశారే తప్ప.. రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇలా మనకేందుకు అనుకుంటూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. ఓ కవి చెప్పినట్లుగా మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనే మాటాల్ని నిజం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన కిరణ్‌కుమార్‌ తల్లదండ్రులు కూలీగా పని చేస్తూ కొడుకుని చదివించారు. ఆ కుమారుడు కూడా తల్లిదండ్రల కష్టాన్ని వమ్ము చేయలేదు. కూలీ పని చేస్తూనే ఇంటర్ పూర్తి చేశాడు. 2003లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. అనిత అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అనిత ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.కిరణ్ 2014లో ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కు మారాడు. జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు.

A constable

కొద్ది రోజుల క్రితమే వారు కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఎస్బీఐ కాలనీలో ఇళ్లు కట్టుకున్నారు. రోజూ కిరణ్ భార్య అనితను బైక్ పై సోమలదొడ్డి ఎక్స్ రోడ్డుకు తీసుకెళ్లి.. అక్కడ బస్సు ఎక్కిస్తుంటాడు. బుధవారం ఉదయం కూడా భార్యను తీసుకుని ఇంటి బైక్ పై బయల్దేరాడు. గోపాల్ దాబా సమీపంలోకి రాగానే వారి బండి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వారు కింద పడ్డారు. అదే సమయంలో వస్తున్న మరో భారీ వాహనం వారిపై నుంచి వెళ్లింది.

దీంతో కిరణ్ కుమార్ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అనిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కిరణ్ కుమార్ అంత తీవ్ర గాయాలైన భార్యను హత్తుకుని భయపడకు అని ధైర్యం చెప్పాడు. అయితే వారికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి అంబులెన్సు సిబ్బంది వచ్చి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు వారిద్దరినీ మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలిస్తుండగా.. కిరణ్ కుమార్ మృతి చెందాడు. ప్రస్తుతం అనిత ప్రాణాలతో పోరాడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+