ఏపీలో తీరం దాటిన తుఫాన్: అయినా అప్రమత్తం: ఇక ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy rains in AP: ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12: 30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ- వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీపై పడింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఇన్ ఫ్లో 3,56,024 క్యూసెక్కులు. కాగా అవుట్ ఫ్లో 5,00,397 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4,61,245 మేర ఉండగా.. అవుట్ ఫ్లో 4,53,700 క్యూసెక్కులు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3,39,434, ఔట్ ఫ్లో 3,14,434 క్యూసెక్కులు ఉంటోంది.
ఈ పరిస్థితుల్లో నేడు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications