నీ సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదన్నా..!

టాలీవుడ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. జూన్ నెలలో వచ్చిన దాదాపు ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది', సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సింగ్ గీతం, అలాగే స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన మా ఇంటి బంగారం ఇలా వరుసగా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి. అటు హాలీవుడ్ మూవీ అబ్సెషన్ కూడా హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. అయితే టాలీవుడ్ లో ఒకప్పటి హీరో వడ్డే నవీన్ దాదాపు 10 ఏళ్ల తర్వాత ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు అనే సినిమాతో థియేటర్ల వద్ద సందడి చేసిన విషయం తెలిసిందే.

వడ్డే నవీన్ అప్పట్లో టాలీవుడ్ లో మంచి విజయాలను నమోదు చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నవీన్. కానీ ఆ తర్వాత వచ్చిన పెళ్లి సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. ఇందులో నవీన్ నటన, అమాయకత్వానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత అదే ఏడాది ప్రియ రాగాలు చిత్రంలో నటించారు. జగపతిబాబు, సౌందర్య నటించిన ఈ మూవీలో కీలక పాత్రలో మెరిశారు.

ఆ తర్వాత 1998 లో మనసిచ్చి చూడు అనే సినిమా చేశారు. వడ్డే నవీన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రాశి హీరోయిన్ గా అలరించారు. ఈ మూవీ మ్యాజికల్ గా అటు ఫ్యామిలీ సెంటిమెంట్ పరంగా మంచి హిట్ అయింది. అనంతరం తాంబూలాలు, చాలా బాగుంది సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు వడ్డే నవీన్. అయితే వడ్డే నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆశించిన విజయాలు దక్కలేదు. ఆయన చివరి సినిమా అయోధ్య(2005).. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వడ్డే నవీన్.

VaddeNaveen Transfer Trimurthulu Suffers Shocking Flop Only 25 Lakh 7 Crore Budget Vadde Naveen

ఈ మూవీలో రాశీ సింగ్‌ హీరోయిన్‌ గా నటించారు. అయితే వడ్డే నవీన్‌ ఈ మూవీని నిర్మించడం విశేషం. ఇక గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి నెగిటివ్ టాక్‌ వచ్చింది. ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. వడ్డే నవీన్ నటనకు మంచి మార్కులు పడినా.. కథ, కథనం కాస్త ఓల్డ్ ఫార్మాట్ లో ఉండటంతో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. దాంతో ఈ మూవీ ఇటీవల రిలీజైన మా ఇంటి బంగారం, దీవానా సినిమాల ముందు తేలిపోయింది. ఈ సినిమాను దాదాపు రూ.7 కోట్లతో నిర్మించారట వడ్డే నవీన్‌. అయితే ఇప్పటివరకూ కేవలం రూ. 25లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+