రైతులకు బిగ్ రిలీఫ్.. యూరియా బుకింగ్ చాలా ఈజీ!
రైతులకు శుభవార్త. గత కొంత కాలంగా ఫెర్టిలైజర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణా సర్కార్ బిగ్ రిలీఫ్ వచ్చే కబురు చెప్పింది. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సరళతరం చేస్తూ, రైతులకు అర్ధమయ్యేలా, ఈజీగా బుక్ చేసుకునే విధంగా 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'ను అప్‌డేట్ చేసింది.
ఎరువుల విషయంలో రైతులకు నో టెన్షన్
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు, దళారుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుల్లో భాగంగా ప్రధాన నిబంధనలు కూడా తీసుకొచ్చారు. ఎరువుల కొరతను నివారించడానికి ఇకపై రైతులు తాము నివసించే లేదా సాగు చేసే సొంత మండల పరిధిలోనే యూరియాను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు దీని కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మండల పరిధిలోనే వీరికి సునాయాసంగా ఫెర్టిలైజర్ దొరుకుతుంది.

ఎకరానికి 2 బస్తాల యూరియానే బుక్ చేసుకునే వీలు
గతంలో మొక్కజొన్న లాంటి పంటలకు ఎకరానికి 5 బస్తాల వరకు వెసులుబాటు ఉండటంతో దుర్వినియోగం జరిగేది. దీనిని అరికట్టడానికి ఈ సీజన్ నుండి ఏ పంట వేసినా ఎకరానికి కేవలం 2 బస్తాల యూరియాను మాత్రమే గరిష్టంగా ఒకే విడతలో బుక్ చేసుకునేలా పరిమితి విధించారు. డీలర్ల అక్రమ నిల్వలను అడ్డుకోవడానికి ప్రత్యేక సమయ నిబంధనలు తెచ్చారు.
యాప్ లో ఎరువులు బుక్ చేసుకోవాలంటే ఇలా చెయ్యాలి
డీలర్లు మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్టాక్ నమోదు చేస్తే అది మరుసటి రోజు ఉదయం 7 గంటలకు, ఉదయం 7 గంటల తర్వాత నమోదు చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రైతులకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. రైతులు ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు యాప్‌లో ఎరువులు బుక్ చేసుకోవచ్చు.
ఓటీపీ లేకుండానే లాగిన్ అయ్యే ఛాన్స్
ఓటీపీ (OTP) రహిత లాగిన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. గతంలో నెట్‌వర్క్ సమస్యల వల్ల ఓటీపీ రాక రైతులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఐటీ విభాగం ఈ సమస్యను తొలగించి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ప్రతిసారీ ఓటీపీ అవసరం లేకుండా నేరుగా యాప్‌లోకి ప్రవేశించి కొన్ని క్లిక్‌లతోనే బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.












Click it and Unblock the Notifications