అలిపిరి నడక మార్గంలో సిగరెట్ తాగిన వ్యక్తి- TTD కఠిన చర్యలు..!!

తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల వేళ భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ సమయంలోనే భక్తులు తిరుమల రద్దీని దృష్టిలో ఉంచుకుని తమ యాత్రను ముందుగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు. కాగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ వ్యక్తి పొగతాగడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంలో టీటీడీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎవరైనా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. రద్దీ వేళ భక్తులు టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. కాగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ వ్యక్తి పొగతాగడం తీవ్ర వివాదానికి దారితీసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించిన సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో, తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. నడక మార్గంలో ఒక వ్యక్తి ధూమపానం చేస్తున్న విషయాన్ని భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేసారు. దీంతో, దీని పైన అధికారులు విచారణ చేసారు.

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్ - దర్శనం టికెట్ల జారీలో కీలక మార్పులు, ఇక నుంచి..!!
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్ - దర్శనం టికెట్ల జారీలో కీలక మార్పులు, ఇక నుంచి..!!
ttd-has-reiterated-that-strict-legal-action-will-be-taken-against-those-who-violate-its-regulations

టీటీడీ కీలక సూచనలు

తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ఇక్కడ మద్యపానం, ధూమపానం, మాంసాహారం, మత్తుపదార్థాల వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉందని అధికారులు స్పష్టం చేసారు. ఈ నిబంధనలు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు టీటీడీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలిసినప్పటికీ, సదరు వ్యక్తి నిబంధనలను అతిక్రమించి పవిత్రమైన నడకమార్గంలో ధూమపానం చేయడం పైన కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని టీటీడీ హెచ్చరించింది. క్షేత్ర పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భక్తులందరూ టీటీడీ నిబంధనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, నవంబర్ నెలకు సంబంధించిన దర్శన.. వసతితో పాటుగా సేవా టికెట్ల విడుదల పైన టీటీడీ షెడ్యూల్ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+