H1B lottery: లక్ హ్యాండిచ్చింది.. టాలెంట్‌ 'విశిష్ట వీసా' ఇచ్చింది

అమెరికాలో స్థిరపడాలనే సగటు భారతీయ ఐటీ ఉద్యోగి కలలకు హెచ్-1బీ వీసా లాటరీ విధానం తరచూ ప్రతిబంధకంగా మారుతోంది. ఎంత ప్రతిభ ఉన్నా, అదృష్టం కలిసిరాక లక్కీ డిప్‌లో పేరు రాకపోతే చదువుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సొంత దేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితి. అయితే, ముంబైకి చెందిన 29 ఏళ్ల సోహన్ సేతి అనే యువకుడు మాత్రం ఆ అదృష్టాన్ని నమ్ముకుని ఊరుకోలేదు. మూడుసార్లు వరుసగా హెచ్-1బీ లాటరీలో తిరస్కరణకు గురైనా వెనక్కి తగ్గకుండా, తన అసాధారణ ప్రతిభనే నమ్ముకుని ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చు చేసి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఓ-1' వీసాను సాధించి ఔరా అనిపించాడు.

ముంబై విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సోహన్, 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. బిజినెస్ అనలిటిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, చికాగోలోని ఒక ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థలో డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ విభాగంలో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెరీర్‌లో శరవేగంగా ఎదుగుతున్నప్పటికీ, వీసా రూపంలో అతనికి వరుస షాక్‌లు ఎదురయ్యాయి. 2023 నుంచి వరుసగా మూడేళ్ల పాటు హెచ్-1బీ లాటరీకి దరఖాస్తు చేసినా అతని పేరు ఎంపిక కాలేదు. 2025 ఏప్రిల్‌లో రెండోసారి కూడా లక్కీ డిప్‌లో పేరు రాకపోవడంతో, కేవలం అదృష్టంపై ఆధారపడితే అమెరికాలో తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాడు.

Defeating the H1B Lottery Indian Techie Invests 12 Lakhs to Secure O-1 Visa for Extraordinary Ability
H1B Visa: 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు చెక్. ఇక సర్దుకోవాల్సిందేనా?
H1B Visa: 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు చెక్. ఇక సర్దుకోవాల్సిందేనా?

ఏకంగా 700 పేజీల ప్రొఫైల్ ఆధారాలు.. రాత్రింబవళ్లు పట్టువదలని శ్రమ!

తన రంగానికి సంబంధించి అసాధారణమైన నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే జారీ చేసే 'ఓ-1' వీసాను దక్కించుకోవాలని సోహన్ నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఒక ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించి, సుమారు $13,000 (మన కరెన్సీలో సుమారు రూ. 12 లక్షలు) న్యాయవాద రుసుములు , డాక్యుమెంటేషన్ కోసం వెచ్చించాడు. ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తూనే తన వృత్తిపరమైన విజయాలను నిరూపించుకోవడానికి అహర్నిశలు శ్రమించాడు. పరిశ్రమలో సాధించిన పురస్కారాలు, మీడియా కథనాలు, పరిశోధనా పత్రాల ప్రచురణలు, రంగానికి చెందిన పోటీలకు జడ్జీగా వ్యవహరించిన ఆధారాలు , దిగ్గజ నిపుణుల రికమండేషన్ లెటర్లన్నింటినీ సేకరించాడు.

US Visa:సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ ఛేంజ్! రెండు కీలక ఫారమ్‌లలో మార్పులు..
US Visa:సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ ఛేంజ్! రెండు కీలక ఫారమ్‌లలో మార్పులు..

చివరకు దక్కిన గుర్తింపు.. ఆందోళనకు ముగింపు పలికిన ఓ-1 వీసా!

అతని నిరంతర శ్రమతో దాదాపు 700 పేజీల భారీ దరఖాస్తు ఫైల్ సిద్ధమైంది. తీవ్ర ఉత్కంఠ మధ్య సంబంధిత అధికారులకు పంపిన దరఖాస్తును పరిశీలించిన అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం, అతనికి ఓ-1 వీసాను మంజూరు చేసింది. నెలల తరబడి వేధించిన అభద్రతా భావానికి , వీసా ఆందోళనకు ఈ ఆమోదముద్రతో తెరపడింది. వీసా వచ్చిన వెంటనే సోహన్ తన సంతోషాన్ని ముంబైలోని తన తల్లి, సోదరుడితో పంచుకున్నాడు. హెచ్-1బీ లాటరీ లక్ రాకపోయినా, ప్రతిభను సరిగ్గా నిరూపించుకుంటే అమెరికాలో కలలను నెరవేర్చుకోవచ్చని సోహన్ సేతి ఉదంతం నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+