నన్ను ప్రతిపక్షంగా చూడొద్దు- కోస్తా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆవేదన

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఉచితం- అని ఒక్క పక్క అంటూనే.. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కంటే మూడింతలు అధికంగా డబ్బులను వసూలు చేస్తోండటం కాకరేపుతోంది.

ఇదే అంశం తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. గ్రామ సచివాలయాలు, ఉచిత ఇసుక అంశాలపై ఆయన మాట్లాడారు. స్వయంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఉచిత ఇసుక విధానం అమలవుతున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

A debate Deputy Speaker Raghu Rama Krishnam Raju and TDP MLA Jyotula Nehru in Assembly

ప్రస్తుతం అమలులో ఉన్న విధానం వల్ల ప్రభుత్వానికి అంత మంచిగా లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇసుక అమ్మకాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాలని సూచించారు. గత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఎవరికి ఇసుక అవసరమైతే వాళ్లు తెచ్చుకునే విధానంలో గతంలో ఉండేదని, అదే విధానంతో దీని అమ్మకాలను వదిలివేసినట్టయితే పై ప్రాంతాలు, పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలుగుతామని జ్యోతుల నెహ్రూ అన్నారు. అవసరమైన వాళ్లే ఉచిత ఇసుకను తెచ్చుకునేలా, వాళ్లే తవ్వుకుని, వాళ్లే రవాణా చేసుకునే వెసలుబాటు కల్పించినట్టయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తాను అభిప్రాయపడుతున్నట్లు జ్యోతుల నెహ్రూ చెప్పారు.

అనంతరం మట్టి విషయంపై సభలో మాట్లాడటానికి ప్రయత్నించగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటాయించిన సమయం ముగిసిందన, కొత్త సభ్యలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పారు.

తన ప్రసంగానికి అడ్డు పడటం పట్ల జ్యోతుల నెహ్రూ స్పందించారు. కూర్చోమంటే కూర్చుంటానని తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. దీనికి రఘురామ బదులిస్తూ తాను కూర్చోమనట్లేదని, త్వరగా ఫినిష్ చేయాలని కోరుతున్నానని అన్నారు. దీనికి జ్యోతుల మాట్లాడుతూ తనకు కేటాయించిన అయిదు నిమిషాల్లో మూడు నిమిషాలు కూడా అవ్వలేదని, తనను ప్రతిపక్షంగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు.

దీనికి రఘురామ 12 నిమిషాలైందని బదులివ్వగా.. వాదనలు తనకు వద్దని, కూర్చోమంటే కూర్చుంటానని ఎలాంటి అభ్యంతరం లేదని జ్యోతుల నెహ్రూ చెప్పారు. ముందు మాట్లాడిన వాళ్లెవరూ కూడా తనకంటే సీనియర్లు కాదని, వారికి ఇచ్చిన సమయం తనకూ ఇవ్వాల్సిన బాధ్యత ఈ సభకు ఉందని పేర్కొన్నారు.

మాట్లాడటానికి టైమ్ ఇస్తానంటే ఓకే.. లేదంటే కూర్చుంటానని తేల్చి చెప్పారు. సభకు కూడా రావొద్దంటే మానేస్తానని స్పష్టం చేశారు. పదికి పదిసార్లు అడ్డుకుంటే తనను ప్రతిపక్షంగా చూస్తున్నట్లు భావించాల్సి వస్తుందని జ్యోతుల నెహ్రూ అన్నారు. తన ప్రసంగాన్ని కొనసాగించబోతోండగా.. ఇలాగైతే తాను సభను నిర్వహించలేనని, దయచేసి అర్థం చేసుకుని కూర్చోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+