భర్తతో గొడవపడి శిశువు గొంతుకోసిన తల్లి: పట్టించుకోవడం లేదని విద్యార్థిని ఆత్మహత్య
ఖమ్మం: భర్తతో గొడవ పడిన ఓ మహిళ, తన పేగును పంచుకుని పుట్టిన మూడు నెలల శిశువును అత్యంత దారుణంగా గొంతుకోసింది. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మండలం గాడ్లగూడెంలో దారుణ ఘటన జరిగింది.
మూడు నెలల శిశువు గొంతుకోసిన తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఆ మహిళ. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను అడ్డుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని కూడా ఆమెతోపాటు ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా, వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తరచూ భర్తతో గొడవలే ఆత్మహత్యాయత్నానికి కారణమని బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని విద్యార్థిని ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మమత అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని, అందుకే చనిపోతున్నానని సూసైడ్‌నోట్‌లో ఆమె పేర్కొంది.
బస్సు కిందపడి మహిళ మృతి
నిజామాబాద్ బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సొంతూరు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ఓ మహిళ ప్రమాదవశాత్తు బస్సు కింద పడి దుర్మరణ చెందింది. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన మాధవి(30) పుట్టింటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. ఈ క్రమంలో పల్లె వెలుగు బస్సు ఎక్కే క్రమంలో తోపులాట జరిగింది. తోపులాట జరుగుతుండగా అదే సమయంలో అటువైపుగా వచ్చిన మరో బస్సు కిందపడి మృతి చెందింది.












Click it and Unblock the Notifications