మహిళపై అత్యాచారం చేసేందుకు ఇలా ..
మంత్రాల పేరుతో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామానికి చెందిన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసింది.
నెల్లూరు :నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి క్షుద్రపూజలు చేసే పేరుతో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
నెల్లూరు జిల్లాలోని మల్లాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్దకు శుక్రవారం రాత్రి కొందరు వచ్చారు. బాధితురాలికి ఒంటరిగా స్మశానంలో పూజలు చేయాలని నమ్మబలికారు.

అది అవకాశంగా తీసుకొని క్షుద్రవైద్యుడు ఆమెపై ఎంత ప్రాధేయపడినా వినకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికి చెప్పినా చేతబడి చేసి చంపేస్తానని బెదిరించాడు.
బాధితురాలికి స్పృహ రాకపోవడంతో ఆదివారం వరకు గ్రామంలోనే ఉండిపోయారు. స్పృహ రావడంతో మాంత్రికుడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications