విషాదం: ఉరివేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అమరావతి: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెనుమూరు మండలం కార్తికేయపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న సుకన్య బలవన్మరణానికి పాల్పడింది.

కానిస్టేబుల్ సుకన్య భర్త తిరుపతి స్విమ్స్‌లో పనిచేస్తున్నారు. సుకన్యకు రెండు నెలల పాప ఉంది. మెటర్నిటీ లీవ్‌లో ఉన్న సుకన్య.. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, తన భార్య ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని సుకన్య భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.

A woman constable commits suicide in Chittoor district

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

అనంతపురం జిల్లాలో భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తితో దారుణంగా దాడి చేశాడు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత పరపురుషులతో మాట్లాడనంటూ హామీ పత్రం రాసివల్లాని కట్టుకున్న భార్యపై ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని గుంతకల్లు పట్టణం ఆంథోనీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. అనంతరం బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లుకు చెందిన రజాక్‌కు అనంతపురానికి చెందిన షర్మిలతో 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తు ఉన్నారు. అయితే, ఈ దంపతలిద్దరూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య ఇతర పురుషులతో మాట్లాడుతోందని భర్త రజాక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఆమెను కొట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

అనంతరం ఇటీవల మూడు రోజుల కింద భార్య తిరిగి ఇంటికి రాగా గొడవ పెట్టుకున్నాడు. ఇక నుంచి ఇతర పురుషులతో మాట్లాడనంటూ తనకు రాతపూర్వకంగా రాసి ఇస్తేనే ఇంట్లో ఉండాలని, అలా తనకు హామీ ఇవ్వాలని షర్మిలపై రజాక్ ఒత్తిడి చేశాడు. అయితే, భర్త షరతులకు ఆమె అంగీకరించకపోవడంతో ఇంట్లో ఉన్న కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో అమానుషం

Recommended Video

    #Watch PV Sindhu కు ఘన స్వాగతం...రూ.30 లక్షల నజరానా | 2 Olympic Medals | Tokyo 2021|Oneindia Telugu

    ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశాన వాటికకు నలుగురు వ్యక్తులు వచ్చిన ఘటన కలకలంగా మారింది. విశాఖ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశాన వాటికకు శనివారం సాయంత్రం ఓ కారులు నలుగురు వ్యక్తులు వచ్చారని, కవర్లో ఉంచిన శిశువును పాతిపెట్టాలని కోరారని శ్మశాసన వాటిక సిబ్బంది చెప్పారు. పాతిపెట్టేందుకు కవర్ తెరవగా శిశువు ఏడవడం ప్రారంభించిందని తెలిపారు. బతికి ఉండగానే ఎందుకు ఖననం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆ నలుగురు వ్యక్తులు అక్క్నుంచి పారిపోయారని చెప్పారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శిశివును ఆస్పత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+