మహిళ ఆత్మహత్య, రిసార్ట్స్‌కు ఎందుకొచ్చింది?: ఇర్ఫాన్ కేసులో ట్విస్ట్

విజయవాడ: గుంటూరు జిల్లాలోని సూర్యలంక బీచ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బీచ్‌లోని హరిత రిసార్ట్స్‌లో త్రిపాఠి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వాసిగా అక్కడి పోలీసులు గుర్తించారు.

అయితే, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఓ సూసైడ్ నోట్ రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ సిటీ ప్రాంతానికి చెందిన ఈమె సూర్యలంక బీచ్ వద్దకు ఎలా, ఎందుకు వచ్చింది. ఆమె ఒక్కరే వచ్చారా, లేక ఆమెతోపాటు మరేవరైనా ఉన్నారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఇర్ఫాన్ కేసు మరో మలుపు తిరిగింది. మౌలాలీ అనే వ్యక్తిని తానే చంపేసినట్లు ఇర్ఫాన్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. మౌలాలిని చంపి బుడంపాడు కాలువలో పడేసినట్లు తెలిపాడు. దీంతో మృతేదహం కోసం బుడంపాడు కాలువలో పోలీసులు గాలిస్తున్నారు.

అప్పు కోసం ఇర్ఫాన్ వద్దకు వెళ్లిన మౌలాలి అదృశ్యమయ్యాడు. దీంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా మౌలాలిని తానే హత్య చేసినట్లు ఇర్ఫాన్ అంగీకరించాడు.

A woman from hitech city in Hyderabad commited suicide

విశాఖ జిల్లాలో మహిళ ఆత్మహత్య

విశాఖపట్టణం జిల్లా కసింకోటలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాగా,మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించే విషయంలో రెండు భిన్న సామాజిక వర్గాలు నిరాకరించడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి.

తమ కాలనీల నుంచి మృతదేహాలను తీసుకెళితే అరిష్టమంటూ స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులకు సర్ధిచెప్పినా కాలనీ వాసులు ఏ మాత్రం వినలేదు. ప్రస్తుతం ఇంటి వద్దే మహిళ మృతదేహం ఉంది.

ఇసుకలో పూడ్చిపెట్టిన ఎర్రచందనం

కడప జిల్లాలో ఇసుకలో పూడ్చిపెట్టిన ఎర్రచందనం దుంగలను స్థానిక పోలీసులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అన్నమాచార్య ప్రాజెక్టు దిగువ భాగంలో 40 ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు ఇసుకలో పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్నటాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులతోపాటు అటవీశాఖ సిబ్బంది అక్కడకు వెళ్లి వాటిని వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+