ఎపి, టి నిప్పుల కుంపటి: 50 మందికి పైగా మృతి

వడగాలుల ప్రభావానికి ఆంధ్రప్రదేశ్‌లో నలభై మందికి పైగా, తెలంగాణలో పన్నెండు మంది వరకు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా అయితే కొలిమిని తలపిస్తోంది. తీవ్రమైన వడగాల్పులకు జిల్లాలో పదిమంది వరకు మృత్యువాత పడ్డారు. విజయనగరం, పశ్చిమ గోదావరి, విశాఖ, ఎస్పీఎస్ నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు మృతి చెందారు.
వడదెబ్బకు ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల్లో గురువారం ముగ్గురు మృతి చెందారు. చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాటు, మద్దుకూరు గ్రామాలకు చెందిన పర్సా నారాయణ, కంచె జనార్దన్ వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. మెదక్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో పలువురు మృతి చెందారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు ఉంటోంది.












Click it and Unblock the Notifications