కుప్పంలో అర్దరాత్రి అరాచకం, కత్తులతో ఎంట్రీ ఇచ్చి ?, సీసీటీవీ కెమెరాల్లో రికార్డు !
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత రాష్ట్రంలోని అనేక జిల్లాలు నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అనేక అసెంబ్లీ నియోజక వర్గాలు నిత్యం హాట్ టాపిక్ లో నిలిచాయి. ఇక చిత్తూరు జిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరిగిన హంగామాతో నిత్యం వార్తల్లో నిలిచాయి.
చిత్తూరు జిల్లాలోని కుప్పం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు, కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఓటమి అనే పదాన్ని దగ్గరకు కూడా రానివ్వకుండా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా, తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడానికి వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు అని తెలుగు ప్రజలకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ లో ఉండే నియోజక వర్గాల్లో కుప్పం నియోజక వర్గం ముందు వరుసలో ఉండటమే కాకుండా కుప్పం నిత్యం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కుప్పం పట్టణం మరోసారి వార్తల్లో నిలిచింది.
కుప్పం పట్టణంలోని హెచ్ పీ రోడ్డులోని మణికంఠ అనే వ్యక్తి దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు వేకువ జామున దుకాణం తీస్తున్న మణికంఠ రాత్రి వరకు వ్యాపారం చేసి తరువాత ఇంటికి వెలుతున్నాడు. రాత్రి వ్యాపారం పూర్తి చేసుకున్న మణికంఠ తరువాత ఇంటికి వెళ్లడానికి సిద్దం అవుతున్నాడు. ఆ సందర్బంలో కొందరు వ్యక్తులు కత్తులతో మణికంఠ షాపు దగ్గరకు వెళ్లారు. తరువాత కత్తులతో మణికంఠను బెదిరించిన నిందితులు అతని షాపులో ఉన్న ఐస్ క్రీం బాక్స్ లో తీసుకుని కారులో పెట్టుకున్నారు.
కేకలు వేసినా, మేము ఇక్కడి నుంచి వెళ్లిపోకముందే హంగామా చెయ్యడానికి ప్రయత్నించినా నీ అంతు చూస్తామని నిందితులు మణికంఠను బెదిరించారు. తరువాత నిందితులు అక్కడి నుంచి పరారైనారు. తరువాత బాధితుడు మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణికంఠను కత్తులతో బెదిరించి ఐస్ క్రీం బాక్స్ లు ఎత్తుకెలుతున్న సమయంలో అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ సీసీటీవీ కెమెరా క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications