బీజేపీ లోకి వైసీపీ ఎంపీలు - కమలం నేత సంచలనం..!!

ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. నూతన అసెంబ్లీ కొలువు తీరింది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావటంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీ లోక్ సభలో కేవలం నాలుగు స్థానాలే దక్కించుకుంది. ఈ సమయంలో వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే అంశం పైన ఏపీ బీజేపీ ముఖ్య నేత కీలక వ్యాఖ్యలు చేసారు. మిథున్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారని చెప్పుకొచ్చారు.

ఏపీ నుంచి వైసీపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ మూడు గెలవగా, వైసీపీ 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంది. నాడు కేంద్రంలో కీలక బిల్లుల ఆమోదంలో వైసీపీ మద్దతుగా నిలిచింది. రాజ్యసభలో 11 స్థానాలు ఉన్న వైసీపీ..పలు సందర్భాల్లో కేంద్రానికి మద్దతు విషయంలో కీలకంగా మారింది. ఇప్పుడు తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. రాజ్యసభలో అదే బలం కొనసాగుతున్నా .. లోక్ సభలో మాత్రం నలుగురే సభ్యులు ఉన్నారు. ఈ సమయంలోనే వైసీపీ సభ్యులు బీజేపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.

Adinarayana Reddy Says YSRCP MP s to join in BJP Soon reveals the names

తాజాగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీలో చేరేందుకు వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అవినాశ్ రెడ్డి మినహా వారంతా బీజేపీలో చేరేలా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. బీజేపీ నుంచి సానుకూల స్పందన రాకపోయినా..వైసీపీ ఎంపీల ప్రయత్నం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. మిథున్ తన తండ్రి పెద్దిరెడ్డిని సైతం బీజేపీలో చేరాలాని ఒత్తిడి చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. దీంతో..ఇప్పుడు వైసీపీ ఎంపీలు బీజేపీ బాట పడతారా..లేక ఈ ప్రచారం ఖండిస్తారా అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+